రామగుండం 800 మెగావాట్లు విద్యుత్ ప్లాంట్.. పెద్దపల్లి జిల్లాకు గర్వకారణం

భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రామగుండం లో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ప్రారంభించడం పెద్దపల్లి జిల్లాకు గర్వకారణమని  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.  మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందన్నారు.  రైతులకు మద్దతు ధరతో పాటు సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదన్నారు.  తెలంగాణకు సాగు నీరు అందించేది ధర్మపురి నియోజకవర్గమేనన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్మపురిలో మూడు మండలాలు టే లాండ్ ప్రాంతానికి చెందినవన్నారు.   ధర్మపురి నియోజకవర్గానికి శాశ్వతంగా నీటి పరిష్కారం కావాలంటే పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేయాలన్నారు. వెల్గటూర్ లో చేపట్టిన లింక్ 2 అదనపు టీఎంసీ ప్రాజెక్ట్ పేరుతో ధర్మపురి నియోజకవర్గలో రైతుల భూములను లాక్కున్నారన్నారు. ఐటీ రంగంలో మరిన్ని కంపెనీలు పెట్టి రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు మంత్రి శ్రీధర్ బాబుకృషి చేస్తున్నారన్నారు,  నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు మంత్రి శ్రీధర్ బాబు కార్యచరణ రూపొందించడం గొప్ప విషయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.