ఇలాంటి భోజనం మీ పిల్లలకు పెడతారా : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

రాయికల్, వెలుగు: ‘ఉడకని అన్నం.. నీళ్లలాంటి పప్పు.. ఈ భోజనాన్ని పిల్లలు ఎలా తింటారు.. మీ పిల్లలకు ఇలాంటి ఆహారమే పెడతారా..?’ అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైర్‌‌ అయ్యారు. మంగళవారం రాయికల్‌ మండలం అల్లీపూర్‌‌ గ్రామంలోని జ్యోతిబాపూలే బాయ్స్‌ స్కూల్‌ను జీవన్‌రెడ్డి సందర్శించారు. మొదటగా క్లాస్​ రూముల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్య బోధన, గురుకులంలోని వసతులపై ఆరా తీశారు. 

భోజనం బాగుండడం లేదని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకురాగా.. కిచెన్‌లోకి వెళ్లి పరిశీలించారు. ఆహారం పదార్థాలు క్వాలిటీగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే కలెక్టర్‌‌కు లెటర్ రాశారు. ఆయన వెంట లీడర్లు అత్తినేని గంగారెడ్డి, మహేందర్‌‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.