నీళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నరు: జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

నందిపేట, వెలుగు :  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలోనే కరువు కనిపించినప్పటికీ కేసీఆర్‌‌‌‌‌‌‌‌ వాస్తవాలను వక్రీకరించి నీళ్ల రాజకీయాలకు తెరలేపారని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ టి. జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శించారు. నందిపేటలో శుక్రవారం నిర్వహించిన ఆర్మూర్‌‌‌‌‌‌‌‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో జరిగిన అవినీతి, నాసిరకం పనుల వల్లే పిల్లర్లు కుంగిపోయాయని ఆరోపించారు. రైతుల ఆదాయాన్ని డబుల్‌‌‌‌‌‌‌‌ చేస్తామని చెప్పిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ ప్రభుత్వాలు పెట్టుబడులను డబుల్‌‌‌‌‌‌‌‌ చేశాయని విమర్శించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కారన్నారు. ఎంపీగా ఉన్న టైంలో కవిత చేసిందేమీ లేదని, మార్పు కోసం అర్వింద్‌‌‌‌‌‌‌‌కు అవకాశం ఇస్తే పసుపు బోర్డు పేరుతో బాండ్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ రాసిచ్చి రైతుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు. 

లక్కంపల్లి సెజ్‌‌‌‌‌‌‌‌ కోసం  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలో ఉన్న టైంలో 420 ఎకరాలు సేకరిస్తే అటు బీజేపీ గానీ, ఇటు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌గానీ ఒక్క కంపెనీ కూడా తేలేకపోయాయన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యలను పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తావిస్తానని, సెజ్‌‌‌‌‌‌‌‌లో కంపెనీల ఏర్పాటు, గల్ఫ్‌‌‌‌‌‌‌‌ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు, బాధిత ఫ్యామిలీల రూ. 5 లక్షల సాయం, పిల్లల చదువు బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి వినయ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, తాహెర్‌‌‌‌‌‌‌‌బిన్‌‌‌‌‌‌‌‌ హందాన్‌‌‌‌‌‌‌‌, గడుగు గంగాధర్‌‌‌‌‌‌‌‌, నగేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, పెంట ఇంద్రుడు పాల్గొన్నారు.