దెబ్బతిన్న కల్వర్టులను రిపేర్లు చేస్తాం : ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

రాయికల్​, వెలుగు:  భారీ వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్లు, చెరువులను యుద్ధప్రాదికన రిపేర్లు చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. రాయికల్ మండలంలో దెబ్బతిన్న బ్రిడ్జిలు, చెరువులను మంగళవారం సందర్శించారు. పట్టణంలోని పెద్ద చెరువు దెబ్బతిన్న తూములు, మత్తడిని వెంటనే రిపేర్‌‌‌‌‌‌‌‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం మండలంలోని బోర్నపల్లి గ్రామంలోని బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మహేందర్ గౌడ్ , పట్టణ అధ్యక్షుడు రమేశ్‌‌‌‌, లీడర్లు మండ రమేశ్, మైపాల్, సుధీర్‌‌‌‌‌‌‌‌, జలందర్,  షకీర్‌‌‌‌‌‌‌‌, రాజేశ్‌‌‌‌, తదితరులు పాల్గొన్నారు.