గల్ఫ్​ పాలసీ ప్రకటనపై హర్షం 

జగిత్యాల రూరల్, వెలుగు: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్  సర్కార్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి జగిత్యాలలోని ఇందిరా భవన్ లో మీడియాతో మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియాతోపాటు సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యమిస్తామన్న సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంలో ప్రతిపక్షాలకు ఉన్న అభ్యంతరం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. అనంతరం విప్ అడ్లూరి మాట్లాడుతూ ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. వారితోపాటు మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్యోతి, లీడర్లు విజయలక్ష్మి, బండ శంకర్, దుర్గయ్య, రాజేందర్, నందయ్య, మోహన్ పాల్గొన్నారు.

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో సీఎం ఫొటోకు క్షీరాభిషేకం 

మెట్ పల్లి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు ముందు గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుంటూ గల్ఫ్ పాలసీని ప్రకటించడంపై ఆ పార్టీ లీడర్లు మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో సంబురాలు చేసుకున్నారు. పాత బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత జువ్వాడి నర్సింగరావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

అనంతరం పార్టీ ఆఫీసులో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ జెట్టి లింగం, అంజిరెడ్డి, లీడర్లు లింగారెడ్డి, గంగాధర్, మహమ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాంప్రసాద్, రాజయ్య, నర్సాగౌడ్ పాల్గొన్నారు.