క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

రాయికల్​, వెలుగు : క్రీడల అభివృద్ది, క్రీడాకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. రాయికల్​మండలం అల్లీపూర్​గ్రామంలో నిర్వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్​ జిల్లాస్థాయి వాలీబాల్​ పోటీలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. వాలీబాల్ టోర్నమెంట్ ఆర్గనైజర్ సుతారి తిరుపతిరెడ్డి

వాలీబాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, లవన్ గౌడ్, రాజగోపాల్, లీడర్లు గంగారెడ్డి, పరమేశ్వర్, రమేశ్, రాజేశ్వర్ రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం రాయికల్​ పట్టణంలో బ్లాక్​కాంగ్రెస్​ అధ్యక్షుడు గోపి రాజరెడ్డి మనువడి నామకరణ మహోత్సవంలో కోరుట్ల కాంగ్రెస్​ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి జువ్వాడి నర్సింగరావుతో కలిసి జీవన్​రెడ్డి పాల్గొన్నారు. 

జగిత్యాల కాంగ్రెస్ సంబురాలు

జగిత్యాల రూరల్ వెలుగు : జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా కూటమి, వయనాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధిక మెజార్టీతో ప్రియాంకగాంధీ గెలుపొందడం హర్షనీయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, నందయ్య, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, రాజేందర్, సరిత, శంకర్, దుర్గయ్య పాల్గొన్నారు.