ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌పై సీబీఐ విచారణ జరపాలి : జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

జగిత్యాలటౌన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ విషయంపై కేంద్రం స్పందించి సీబీఐ విచారణ జరపాలని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాలలోని ఇందిరాభవన్‌‌‌‌‌‌‌‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌దే ప్రధాన పాత్ర అని ఆరోపించారు. సీబీఐ విచారణ జరిగితే కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇరుక్కోవడం ఖాయమని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లుగా ఉమ్మడి జిల్లా నుంచి పోటీ చేసిన మేడిపల్లి సత్యం, జువ్వాడి నరసింగరావు, కవ్వంపెల్లి సత్యనారాయణ ఫోన్లు సైతం ట్యాప్‌‌‌‌‌‌‌‌ అయినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పేరును బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌గా మార్చడం వల్లే కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఓడిపోయారని, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పట్ల భస్మాసుర హస్తాంగా మారిందన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్లు మార్చడంతో పాటు వెనుకబడిన అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

గతంలో ఆంధ్రా సినిమాలకు పన్ను మినహాయింపు ఇచ్చిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌.. ఇప్పుడు కీరవాణితో రాష్ట్ర గీతం కంపోజ్‌‌‌‌‌‌‌‌ చేయించడాన్ని తప్పుపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. బల్దియా చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ జ్యోతి, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు నాగభూషణం, శంకర్, దుర్గయ్య, నందయ్య, అశోక్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.