కల్వకుంట్ల కుటుంబానికి కౌశిక్‌‌‌‌రెడ్డి దాసోహం : బల్మూరి వెంకట్​

  • ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​

జమ్మికుంట, వెలుగు: అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా.. కల్వకుంట్ల కుటుంబానికి కాపాడేందుకే ఎమ్మెల్యే కౌశిక్‌‌‌‌రెడ్డి ప్రాధాన్యమిచ్చాడని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌‌‌‌ మండిపడ్డారు. హుజూరాబాద్‌‌‌‌ మండలం కందుగుల గ్రామంలో జయన్న ఫౌండేషన్ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ గుడిపాటి జైపాల్‌‌‌‌రెడ్డి– సరిత దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం చెల్పూర్, జమ్మికుంట, కొత్తపల్లి, సిరిసిడు, మల్లన్నపల్లి గ్రామాల్లో ఇటీవల చనిపోయిన కుటుంబాలను పరామర్శించారు. 

ఈ సందర్భంగా బల్మూరి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్‌‌‌‌రెడ్డి కల్వకుంట్ల కుటుంబానికి దాసోహమయ్యాడని, వారిని కాపాడేందుకు స్పీకర్ పై ప్లకార్డులను విసిరాడని ఆరోపించారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్‌‌‌‌రెడ్డి.. ఇందిరానగర్ శాలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు పార్టీ మీటింగ్‌‌‌‌కు వెళ్లి వస్తుండగా చనిపోయారని వారి కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తానని మాటిచ్చి మర్చిపోయాడన్నారు. దళితులకు అండగా ఉంటానని చెప్పుకుంటూ దళితులను ఎమ్మెల్యే మోసం చేసిండన్నారు. కార్యక్రమంలో లీడర్లు కసుబోజుల వెంకన్న, శ్రీనివాస్, సలీం, శ్రీకాంత్, పాషా, తదితరులు పాల్గొన్నారు.