నీ స్కాములన్ని బయటపెడుతా.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు: కౌశిక్ రెడ్డిపై వెంకట్ ఫైర్

బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. బుధవారం (నవంబర్ 20) కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బల్మూరి వెంకట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితబంధు పేరుతో నీ కపట నాటకాలు ఆపని.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దళిత బంధు పేరుతో నీ అనుచరులు లక్షల రూపాయలు వసూల్ చేశారని ఆరోపించారు. 

నువ్వు దళిత ద్రోహివని.. త్వరలోనే నీ స్కాములు నీ ఆరాచకాలు అన్నీ బయటపెడుతా.. నిన్ను వదిలేది లేదని కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు. నీ పార్టీ మీటింగ్‎కి వచ్చి ఇద్దరు మహిళలు చనిపోతే పది లక్షల రూపాయలు ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల నీకున్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోంది కౌశిక్ రెడ్డి.. అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపడం ఇకనైనా మానుకో అని వార్నింగ్ ఇచ్చారు.

Also Read :- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్

దళితులకు అండగా నిలిచి వారికి చేయూతనిచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుజురాబాద్‎లో దళితులకు మంజూరు అయిన దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల హుజురాబాద్‎లో కౌశిక్ రెడ్డి పెద్ద ఎత్తున ఆందోళకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డికి బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు.