విద్యారంగానికి పది శాతం నిధులు కేటాయించాలి : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

కోదాడ, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో విద్యారంగానికి 10 శాతం నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కోదాడలోని యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పోరాటంతోనే ఉపాధ్యాయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక  సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు.

ఉపాధ్యాయ ఉద్యమాలు బలంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. మరోసారి తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసనమండలిలో ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని తెలిపారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షుడు ధనమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంగ, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు  పాల్గొన్నారు.