కేసీఆర్​ కుటుంబాన్ని చూసి దొంగలు కూడా సిగ్గుపడ్తరు : రేవూరి ప్రకాశ్​రెడ్డి

  • పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్​రెడ్డి, కేఆర్ నాగరాజు

శాయంపేట (ఆత్మకూర్​), వెలుగు: తెలంగాణ సెంట్​మెంట్​తో రాష్ట్రంలోని వనరులను, గవర్నమెంట్ భూములను మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకున్న తీరునుచూసి స్టూవర్టుపురం దొంగలు కూడా సిగ్గుపడతారని పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్​రెడ్డి, కేఆర్​ నాగరాజు అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఆత్మకూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

ఎమ్మెల్యేలు ముఖ్య​అతిథులుగా హాజరై చైర్‌‌పర్సన్​గా బీరం సునందాసుధాకర్​రెడ్డి, వైస్ చైర్మన్ గా తంగెళ్లపల్లి తిరుపతి, కమిటీ డైరెక్టర్లుగా కాడబోయిన రమేశ్, పిట్టల రాజేందర్, సానబోయిన రవి, షేక్ నవీర్, దామెర చక్రియ, లక్కిడి సుజాత, ముండ్రాతి భిక్షపతి, పల్లె దయాకర్, గౌరు రాజి రెడ్డి, జాడి రాజీవ్ గాంధీ, పాడి గణపతి రెడ్డి, సీహెచ్ భాను ప్రకాశ్​తో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ధరణి పేరుతో రాష్ర్టంలో మాజీ సీఎం కేసీఆర్​ కుటుంబం, నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గవర్నమెంట్ భూములను దొచుకున్నారని ఎద్దేవా చేశారు.

నియోజకవక వర్గంలో ప్రతీ కార్యకర్తకు, నాయకులకు అందుబాటులో ఉంటామన్నారు. గత గవర్నమెంట్ హయాంలో జరిగిన దోపిడీని కాంగ్రెస్​పార్టీ నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసే నాయకులకు గుర్తింపు, పదవులు అందుతాయన్నారు. ఆత్మకూరు మార్కెట్ ని వరంగల్ ఏనుమాముల మార్కెట్ కు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దొమ్మటి సాంబయ్య, పరకాల పట్టణాధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, ఆత్మకూర్ అధ్యక్షుడు రమేశ్, నాయకులు బీరం రామకృష్ణారెడ్డి, కీసరి రాజిరెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, పీఏసీఎస్ జనగామ ప్రభాకర్ గౌడ్, పెద్దాపురం సొసైటీ వైస్ చైర్మన్ అంబటి రాజస్వామి, మార్క రజనీకర్ గౌడ్, మాజీ సర్పంచ్​  పర్వతగిరి రాజు, మాజీ వైస్ ఎంపీపీ జనగాం శ్రీలత రాజు గౌడ్, ఆఫీసర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.