ఇందారం గ్రామ అభివృద్ధి పనులకు రూ.20లక్షలు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఇటీవల మృతిచెందిన కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆదివారం (సెప్టెంబర్30) ఇందారం గ్రామానికి వెళ్ళారు వివేక్ వెంకటస్వామి. గ్రామంలో ఇటీవల ఓ కాంగ్రెస్ కార్యకర్త చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. 

అనంతరం మార్నింగ్ వాక్ చేస్తూగ్రామాలో కలియ తిరిగారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నీటి సమస్య, డ్రైనేజీ సమస్య ఉందని గ్రామస్తులు చెప్పారు. గ్రామంలో బోర్లు, రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి రూ. 20లక్షలు మంజూరు చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. గతంలో విశాఖ చారిటబుల్ ట్రస్టు తరపున ఇందారంలో 20 బోర్లు వేసి ప్రజలకు తాగునీటిని అందించామన్నారు. ఇప్పుడు గ్రామంలో పలు సమస్యలున్నాయని చెప్పారు. బోర్లు, రోడ్లు, డ్రైనేజీలకు రూ. 20లక్షలు మంజూరు చేస్తున్నామని చెప్పారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 

అనంతరం మందమర్రి మండలం కుర్మపల్లిలో పర్యటించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కుర్మపల్లికి చెందిన సింగరేణి కార్మికులు బైరి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

కుర్మపల్లిలో స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించాలని,తమ భూములకు పట్టాలు ఇవ్వడం లేదని గ్రామస్తులు ఎమ్మేల్యే దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామస్థులకు హామి ఇచ్చారు చెన్నూర్ ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి.