మంచిర్యాలలో కియా షోరూం.. ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల: ప్రముఖ కార్ల కంపెనీ కియా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కియా షోరూం ను అందుబాటులోకి తెచ్చింది. గురువారం ఆగస్టు 08,2024న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ షోరూంను ప్రారంభించారు. షోరూం యాజమాన్యంతో కలిసి ప్రారంభోత్సవ పూజలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా వాసులకు సౌకర్యంగా జిల్లా కేంద్రంలో కియా షోరూం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉదన్నారు వివేక్ వెంకటస్వామి. 

జిల్లా కార్ల  కొనుకోలు కోసం హైదరాబాద్ కు వెళ్లకుండా కియా కంపెనీకి చెందిన వివిధ రకాల మోడళ్లు మంచిర్యాలలో అందుబాటులో ఉంటున్నాయని అన్నారు. మంచిర్యాలకు ఇంత పెద్ద కార్ల షోరూం రావడం అభినందనీయం అన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సారగ్ రావు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.