మాలల గౌరవం తగ్గించే ప్రయత్నం జరుగుతోంది : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

అన్ని రాజకీయ పార్టీల్లో మాలలపై వివక్ష ఉందని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. నిజామాబాద్ లో మాల సంఘం ఆత్మీయ సమ్మేళనంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ పాల్గొని, మాట్లాడారు. మాలల గౌరవం తగ్గించే ప్రయత్నం ఇంకా కొనసాగుతునే ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాలలందరికి విశ్వసం కల్పించేందకు తాను ప్రయత్నిస్తున్నానని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. మాదిగలు తప్పుడు లెక్కలు చూపించి కేంద్రాన్ని ఎస్సీ వర్గీకరణకు ఒప్పించారని ఆయన ఆరోపించారు. తాను బీజేపీలో ఉన్నపుడు SC వర్గీకరణను వ్యతిరేఖించానని చెన్నూర్ ఎమ్మెల్యే సభాముఖంగా చెప్పారు. 

Also Read : పొంగులేటి బాంబుల శాఖ మంత్రి

అమిత్ షాకి మాలలపై ఉన్న అపోహను తొలగించేందుకు ఆయన ప్రయత్నించానన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని మాల ఎమ్మెల్యేలందరం కలిసి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వొద్దని కోరామని ఆయన చెప్పారు. మాలలు తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని గడ్డం వివేక్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో డిసెంబర్ 1 న జరిగే మాలల ఆత్మీయ సభకి భారీగా హాజరుకావాలని ఆయన కోరారు.