చెన్నూరు చెరువు మత్తడి పేల్చినోళ్లను వదలం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూరు చెరువు మత్తడి పేల్చివేసినవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆయకట్టు రైతులకు నష్టం జరిగేలా మత్తడిని పేల్చివేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలి చ్చామన్నారు. 

సంఘ విద్రోహ చర్యలకు పాల్పడినవారు ఎవరైనా వదిలిపెట్టేది లేదని.. వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనారోగ్య కారణాల వల్ల శనిగకుంట చెరువును తాను సందర్శించ లేకపోయాన న్నారు వివేక్ వెంకటస్వామి. 

చెన్నూరు నియోజకవర్గం పరిధిలో జూదం, సంఘ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి పోలీసులు రేయింబవళ్లు పెట్రోలింగ్ చేయాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అన్నివర్గాల సహకారం ఉండాలని పేర్కొన్నారు.