దేవునిపల్లి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో పాల్గొన్న వివేక్​వెంకటస్వామి

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా దేవునిపల్లి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో చెన్నూర్​ ఎమ్మెల్యే డాక్టర్​ గడ్డం వివేక్​ వెంకటస్వామి బుధవారం పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ వివేక్‌‌ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది దేవునిపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంచినీటి సరఫరాకు ఏర్పాటు చేయాలని కోరారని గుర్తుచేశారు. ఎంపీ ఫండ్స్‌‌ నుంచి తాగునీటి కోసం నిధులు విడుదల చేయమని ఎంపీ వంశీకృష్ణను కోరుతానన్నారు. బొడ్డుపల్లి సదయ్య, బొక్కల సంతోష్​, శ్రీధర్ పటేల్, వెంకటేశం, మహేందర్, భూమయ్య, రామస్వామి పాల్గొన్నారు.

నూతన వధూవరులకు ఆశీర్వాదం 

శంకరపట్నం, వెలుగు: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో బుధవారం ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. కొత్తగట్టు గ్రామానికి చెందిన ఉప్పుగల శ్రీనివాస్ రెడ్డి–రమ దంపతుల కూతురు సమతకు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ సీనియర్ లీడర్‌‌‌‌ అయిరెడ్డి సంపత్ రెడ్డి, శారద దంపతుల కొడుకు సుశిధర్ రెడ్డికి పెండ్లి జరిగింది. వివాహానికి హాజరైన వివేక్‌‌ వెంకటస్వామి కొత్తజంటను ఆశీర్వదించారు.