మందమర్రిలో రూ.2.80 కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల: పదేండ్లుగా చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమర్రిలో మున్సిపాలిటీ పరిధిలోని 24వార్డులో రూ. 2కోట్ల 80 లక్షల సీపీఆర్ నిధులతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, అధికారులు పాల్గొన్నారు. 

గత ప్రభుత్వ హయాంల చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ది జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎమ్మెల్యేగా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామన్నారు.మందమర్రిలో సీసీరోడ్లు, సైడ్ డ్రైనేజీ పూర్తిస్థాయిలో నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. ఇంటింటికి తాగునీరు సౌకర్యం కల్పించేందుకు అమృత్ స్కీం కింద రూ.30కోట్ల నిధులు తీసుకువస్తామన్నారు. 

ALSO READ | చదువు ప్రతి ఒక్కరి హక్కు.. చదువుకుంటేనే బాగుపడతాం: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

గతంలో మందమర్రి ,బెల్లంపల్లి మున్సిపాలిటీలకు గోదావరి తాగునీరు ను అందించేందుకు 24 కోట్లతో కాకా వెంకటస్వామి శాశ్వత పథకం తీసుకువచ్చారు.. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్యాంకర్లతో  మందమర్రిలో తాగు నీరు అందించామని గుర్తు చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 

అనంతరం అనారోగ్యంతో బాధ పడుతున్న మందమర్రి మండలం సారంగపల్లి మాజీ సర్పంచ్ కమల మనోహర్ రావును ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు.