కేసీఆర్ కు ఏనాడు భయపడలేదు.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

సూర్యపేట జిల్లాలో మాల, మాల ఉద్యోగస్తుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆదివారం ( అక్టోబర్ 6, 2024 ) జరిగిన ఈ సమావేశానికి  భారీ ఎత్తున మాలలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు వివేక్ వెంకటస్వామి. మాలలు ఐకమత్యంగా ఉండాలని.. ఐక్యమత్యంతోనే ఏదైనా సాధించగలమని అన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేసినప్పుడు కూడా ఏనాడు భయపడలేదని అన్నారు.

గడ్డం కుటుంబం చేసిన సేవలను గుర్తించి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు తమ కుటుంబాన్ని గెలిపించి తగిన గౌరవం ఇచ్చారని అన్నారు.అందరిని సమానంగా చూసిన వ్యక్తి కాకా అని.. జాతి కోసం తమ కుటుంబం పోరాటం చేసిందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు జాతిని వాడుకోవాలని చూసారని అన్నారు. 

ALSO READ | Good News: సికింద్రాబాద్​ టూ గోవా ట్రైన్​ ప్రారంభం

ఇటీవల ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఎమ్మార్పీఎస్ కు మంచి కంటే ఎక్కువ నష్టమే  ఉందని అన్నారు వివేక్ వెంకటస్వామి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రితిక ఇన్ హోటల్ లో జరిగిన ఈ సమావేశానికి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్  వెంకట స్వామి, వర్దన్న పేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.