చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలకు అస్వస్థత.. పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెల అస్వస్థతకు గురయ్యారు. శనివారం ( అక్టోబర్ 12, 2024 ) స్వల్పంగా బీపీ పెరగటంతో స్పృహ తప్పి పడిపోయిన ఓదెలను మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు.ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓదెలను పరామర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వంకటస్వామి. అనుచరులతో కలిసి వెళ్లి ఓదెలను పరామర్శించిన వివేక్ వెంకటస్వామి ఓదెలకు దైర్యంగా ఉండాలని సూచించారు.

ఓదెలకు పరీక్షలు నిర్వహించి స్వల్పంగా బీపీ పెరిగిందని నిర్దారించిన డాక్టర్లు.. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఓదెలకు వైద్యం అందించి ఇంటికి పంపిన డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించారు.