ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేస్తాం : విజయరమణారావు

పెద్దపల్లి, వెలుగు: ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీ సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందజేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మంగళవారం పట్టణంలోని 4, 23వ వార్డుల్లో  ఎమ్మెల్యే పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అమృత్ పథకంలో రూ. 22 కోట్లతో చేపట్టే పనులకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. పట్టణంలో తాగు నీరు, రోడ్ల, డ్రైనేజీ, పరిశుభ్రత సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.