గ్రామీణ విద్యార్థులకు చేయూత : విజయరమణారావు

  • కాలేజ్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు సొంత ఖర్చులతో ఎమ్మెల్యే మిడ్ డే మీల్స్ 

పెద్దపల్లి/సుల్తానాబాద్, వెలుగు : సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు 45 రోజులపాటు సొంత ఖర్చులతో ఎమ్మెల్యే విజయరమణారావు ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ..  వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా గ్రామీణ ప్రాంతం నుంచి  కాలేజీకి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కష్టంగా మారిందన్నారు. 

దీన్ని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి , ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్ రావు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత , ప్రిన్సిపాల్ ఎన్.రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

దివ్యాంగులకు పరికరాల పంపిణీ 

పెద్దపల్లి సెగ్మెంట్ లో 198  మంది దివ్యాంగులకు రూ.27.50 లక్షల విలువచేసే ట్రై సైకిళ్లను, బ్యాటరీ సైకిళ్లను, చేతి కర్రలు, వినికిడి పరికరాలను, బుధవారం పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయ రమణారావు పంపిణీ చేశారు. రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ  ఆధ్వర్యంలో అలింకో వారి సౌజన్యంతో వీటిని అందించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన దివ్యాంగులకు ప్రశంస బహుమతులను ఎమ్మెల్యే అందజేశారు.