పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేకనే ధర్నాలు : ఎమ్మెల్యే విజయరమణారావు

పెద్దపల్లి/ సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కాంగ్రెస్​ సర్కాస్​ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు ధర్నాలు చేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు విమర్శించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కూడా లేకుండా పోతామనే భయంతో బీఆర్ఎస్ లీడర్లు రోడ్లపైకి వచ్చి రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్​మాటలకు, చేతలకు పొంతన లేదని, ఆయన విచారణకు హాజరై నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీల చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌, చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఈర్ల స్వరూప, మినుపల ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రావు, లీడర్లు మల్లయ్య, సంపత్, రామ్మూర్తి, రాజేందర్, సుభాష్, ఆశ్రాఫ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, సర్వర్ పాల్గొన్నారు. 

సుల్తానాబాద్, వెలుగు: గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం కనుకుల ప్యాక్స్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో రామునిపల్లి, కనుకులలో రూర్బన్ పథకం కింద నిర్మించిన గోదాములను, సొసైటీ కార్యాలయం విస్తరణ భవనాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక రోడ్లను డబుల్‌‌‌‌‌‌‌‌ రోడ్లుగా మారుస్తామన్నారు. డీసీవో శ్రీమాల, సొసైటీల చైర్ పర్సన్లు కోట వీణ, శ్రీగిరి శ్రీనివాస్, మహిపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సీఈవో శంకర్, లింగారెడ్డి పాల్గొన్నారు.