డిసెంబర్ 7న సీఎం బహిరంగ సభకు జనసమీకరణ  : ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్, వెలుగు : ఈనెల 7న జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి జనసమీకరణ చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. బుధవారం నకిరేకల్ లోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును ఈనెల 7న సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు.

అనంతరం నల్గొండ పట్టణంలో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారని తెలిపారు. సీఎం సభకు పార్టీ శ్రేణులు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పట్టణంలోని సాయిబాబా కల్యాణ మండపంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రుణాలు అందజేశారు.