ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల

బాల్కొండ,వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరందించేందుకు బుధవారం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాజెక్టు ఆఫీసర్ల తో కలిసి బుధవారం కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. కాకతీయ కాలువ కు 1000 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని వదిలారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 రోజుల కిందటే నీటిని వదలాల్సి ఉండగా ఆలస్యం అయిందన్నారు. కాళేశ్వరం,మేడి గడ్డ బ్యారేజ్ లపై అసత్య ప్రచారం చేసి రైతుల జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. రూ.90వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం,4 వేల కోట్లతో చేపట్టిన మేడిగడ్డ బ్యారేజ్ లతోనే నీటిని నింపుతున్నారని గుర్తు చేశారు. మేడి గడ్డ బ్యారేజ్ లో ఉన్న 84 పిల్లర్లలో  రెండు పిల్లర్లు కుంగితే రాజకీయం కోసం వాడుకున్నారని ధ్వజమెత్తారు.