నవీపేట్, వెలుగు: స్కూల్స్ ఓపెన్ చేసిన రోజునే విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ అందజేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నవీపేట్ రెంజల్ మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నమెంట్ స్కూల్ వచ్చే పేద పిల్లలను దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి స్కూల్ లో మౌలిక వసతులతో పాటు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు డ్రెస్ లను ముందే అందజేయాలని ఆదేశించారన్నారు.
మహిళా సంఘాలతో డ్రెస్సులు కుట్టించడం వల్ల వారికి కూడా ఉపాధి లభిస్తుందన్నారు. విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీటీసీ మీనా నవీన్ రాజ్ తహసీల్దార్ నారాయణ, ఎంపీడీఓ నాగనాథ్ తదితరులు పాల్గొన్నారు.