వారంలోగా ధరణి సమస్యలు పరిష్కరించాలి : సుదర్శన్ రెడ్డి 

నవీపేట్, వెలుగు: వారం రోజుల్లోగా ధరణి సమస్యలు పరిష్కరించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీతో కలిసి రైతులతో ధరణి సమస్యల గురించి ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రైతు సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టారన్నారు.

ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి వారం లోగా పట్టా పాసుపుస్తకాలు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, ఎంపీపీ శ్రీనివాస్, ఆర్డీవో రాజేందర్, తహసీల్దార్ నారాయణ, రైతులు, లీడర్లు పాల్గొన్నారు.