మౌలిక వసతుల కల్పనకు కృషి : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

  • ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్ వెలుగు: జగిత్యాల మహిళా డిగ్రీ కాలేజీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కాలేజీలో రూ.ఐదు కోట్లతో నిర్మించనున్న  అడిషనల్‌‌‌‌ తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగ సాధనకు కావలసిన మెలకువలను విద్యార్థులకు వివరించారు.

 అనంతరం మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కేంద్రం విద్యావైద్యానికి హబ్‌‌‌‌గా మారిందని అన్నారు. అలాగే వివేకానంద మినీ స్టేడియంలో జగిత్యాల బల్దియాకు చెందిన తొమ్మిది నూతన స్వచ్ఛ ఆటోలను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ జ్యోతి, అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి, కమిషనర్ చిరంజీవి, ప్రిన్సిపాల్స్ రామకృష్ణ, అశోక్, అనితసింగ్ పాల్గొన్నారు.