జగిత్యాల జిల్లాలో ఆలయాల అభివృద్ధికి టీటీడీ నిధులు

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లాలో ఆలయాల అభివృద్ధికి టీటీడీ నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌‌‌‌‌కుమార్  తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీరామమందిరంలో టీటీడీ ద్వారా మంజూరైన రూ.10లక్షలతో భజన మందిరం నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు టీటీడీ నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 

జగిత్యాల నియోజకవర్గంలో 9 ఆలయాలకు నిధులు మంజూరైనట్లు తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్  జ్యోతి, వైస్ చైర్మన్  శ్రీనివాస్, కౌన్సిలర్ జయశ్రీ, సూర్యనారాయణశర్మ, బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.