రూ.100 కోట్లతో జగిత్యాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ : ఎమ్మెల్యే సంజయ్​కుమార్​

రాయికల్/జగిత్యాల రూరల్‌, వెలుగు: జగిత్యాలలో రూ.100కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ మంజూరైందని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌‌ తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా జగిత్యాల రూరల్‌, రాయికల్‌ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ కావాలని కోరిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి మంజూరు చేశారన్నారు.  

జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. అనంతరం జగిత్యాల రూరల్ అంతర్గాం వడ్డెర కాలనీ, అర్బన్ మండలం మోతే గ్రామంలోని తురుక కాశినగర్‌‌లో అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు.