జగిత్యాల రూరల్ వెలుగు: జగిత్యాల పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 32వ వార్డులో రూ 10.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే జిల్లాలోని కాంట్రాక్టర్లకు రూ.5కోట్ల బకాయిలు చెల్లించినట్లు తెలిపారు.
అనంతరం పట్టణంలోని ఉప్పరపేటలో శ్రీ దాసాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆ తర్వాత రూరల్ మండలం గొల్లపల్లె గ్రామంలోని గుట్టమల్లన్న ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి, కమిషనర్ చిరంజీవి, ఏఈ అనిల్ తదితరులు పాల్గొన్నారు.