జగిత్యాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి :ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్,  వెలుగు: జగిత్యాల అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. శనివారం సీఎం నివాసంలో మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జగిత్యాల అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.

బల్దియా మాజీ చైర్మన్ లు గిరి నాగభూషణం, మెట్టబట్టి ఉన్నారు. అనంతరం గల్ఫ్ కార్మికుల సంక్షేమ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ , విప్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్ల తో కలిసి పాల్గొన్నారు.