ఎమ్మెల్యేగా గెలిచిన తొలి ఏడాదిలోనే రూ.280 కోట్ల అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  •     ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చుతూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభివృద్ధికి చిరునామాగా మారిందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. గురువారం గోదావరిఖనిలోని తన క్యాంపు ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లిలో సీఎం సభను సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గత పాలకులు అప్పులతో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటూ హామీలను నెరవేరుస్తోందన్నారు. 

ఎమ్మెల్యేగా గెలిచిన తొలి ఏడాదిలోనే రామగుండంలో రూ.280కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. పత్తిపాక రిజర్వాయర్, పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరలో పూర్తి కానున్నాయని, వీటి ద్వారా దాదాపు 35 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని ఎమ్మెల్యే వెల్లడించారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మేయర్ అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, సుజాత, తేజస్విని, ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముస్తఫా, ఫక్రిద్దీన్, లీడర్లు శ్రీనివాస్, బాలరాజు, రాజిరెడ్డి, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.