రూ.2 కోట్లతో అయ్యప్ప ఆలయం : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

  • రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి

కోటగిరి, వెలుగు: కోటగిరి మండల కేంద్రంలో నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయం ఓ అద్భుత ఘట్టమని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల పోస్టర్‌‌, ఫ్లెక్సీలను రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం నవ చండీ హోమం,మహా సుదర్శన హోమం నిర్వహించేందుకు నిర్మించే  యాగశాలకు భూమిపూజ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 14 నుంచి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రామస్తులు సొంత డబ్బుతో ఆలయ నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. ఆలయ నిర్మాణానికి సుమారు రూ.2కోట్లు ఖర్చైనట్లు చెప్పారు. కార్యక్రమంలో యాదాద్రి స్థపతి మోతిలాల్, గురుస్వామి బీర్కూర్ గంగాధర్, కోటగిరి సొసైటీ చైర్మన్ కూచి సిద్దు, పోల అశ్విన్, నిశాంత్, సంతోష్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, లీడర్లు పాల్గొన్నారు.

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

బాన్సువాడ, వెలుగు: బాన్సువాడలో గురు బసంత్ పేరుతో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్​ను రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. 45 ఏండ్లకు పైబడ్డ వారితో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా, నాలుగు టీమ్​లు పాల్గొన్నాయి.