సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలి : ఎమ్మేల్యే పోచారం శ్రీనివాసరెడ్డి

 వర్ని, వెలుగు: సిద్దాపుర్ రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.  వర్ని మండలం సిద్దాపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ నాలుగు ఆనకట్టల నిర్మాణ పనులను మంగళవారం  ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దాపూర్ రిజర్వాయర్ ను రూ. 258 కోట్ల వ్యయంతో ఒక టీఎంసీ కెపాసిటీ తో నిర్మిస్తున్నామన్నారు.  నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  ఇరిగేషన్ అధికారులు పనులను పర్యవేక్షించాలన్నారు.  పనుల్లో వేగంతో పాటుగా నాణ్యత పాటించేలా చూడాలని సూచించారు.