ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : పవార్ రామారావు పటేల్

భైంసా, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ముథోల్​ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డిమాండ్ ​చేశారు. లేకపోతేవారి పక్షాన పోరాటం చేస్తానని వెల్లడించారు. గురువారం ఆశా వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో భైంసాలోని ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని వినతిపత్రం అందించారు. కరోనా కాలంలో ఆశా వర్కర్లు ఎంతో కష్టపడ్డారని, వారి సేవలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వారికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తాని అన్నారు.

మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావితరాలకు బాసటగా నిలవాలని రామారావు పటేల్ అన్నారు. భైంసా పట్టణంలోని గోశాలలో నిర్వహించిన వన మహోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. వాతావరణాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ, ప్రతి ఇంటా మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బి.గంగాధర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గోపాల్ సర్దా తదితరులు పాల్గొన్నారు.