మంత్రి జూపల్లి చాంబర్​ను తగలబెడదామనుకున్నా : ఎమ్మెల్యే పైడి రాకేష్​ రెడ్డి

నిజామాబాద్, వెలుగు: మంత్రి జూపల్లి చాంబర్​ను తగలబెడదామనుకున్నానని ఎమ్మెల్యే పైకి రాకేష్​ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో శనివారం నిర్వహించిన దిశ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ఆర్మూరు సెగ్మెంట్లో ఆఫీసర్లు ప్రొటోకాల్  పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ విషయం గురించి అడిగినా  ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అనుమతులు కావాలంటూ దాటవేస్తున్నారని మండిపడ్డారు. 

 ప్రోగ్రామ్స్ సమాచారం తనకు తెలియజేయడం లేదని, ఎమ్మెల్యేగా గెలిచి అవమానాలు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అవమానాలు భరించలేక ఇన్ చార్జి మంత్రి చాంబర్ ను తగలబెట్టాలనిపించిందని పేర్కొన్నారు.