ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ కేటాయించాలి

  •     కేంద్ర మంత్రిని కలిసిన ఆర్మూర్​ ఎమ్మెల్యే

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంటిగ్రేటెడ్​మోడల్​స్కూల్​మంజూరు చేయించాలని ఆర్మూర్​ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ​కిషన్ రెడ్డిని కలిసి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రావాల్సి ఉండగా.. ఖమ్మం జిల్లా మధిరకు కేటాయించారని మంత్రికి వివరించి మెమోరాండం అందజేశారు.

 మూడో పైలెట్ ప్రాజెక్టులో ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్​ మోడల్​ స్కూల్​ కేటాయించాలని డిమాండ్​ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు అనుమతి ఇప్పించాలని కేంద్ర మంత్రిని ఎమ్మెల్యే కోరారు.