గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

  • ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

కోదాడ, వెలుగు : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ మండలం గుడిబండ, కాపుగల్లు, తొగర్రాయి, రెడ్లకుంట గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో లింక్ రోడ్లు, సీసీ రోడ్లు, మెటల్ రోడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. గ్రామాల మధ్య అంతర్గత రోడ్ల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. 

రైతుల సౌకర్యం కోసం పీఏసీఎస్ ఆధ్వర్యంలో గోదాంలు నిర్మించామని చెప్పారు. పీఏసీఎస్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా వృద్ధి చెందాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, వరప్రసాద్ రెడ్డి, నంబూరి సూర్యం, తొండపు సతీశ్, ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, గంగవరపు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.