గోదావరిఖని, వెలుగు: గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన రామగుండాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని, ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకువస్తానని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక క్యాంప్ఆఫీస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్‌లో 15 రోజుల్లో అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు మొదలు పెట్టి, ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఎన్టీపీసీ, కేశోరామ్, ఆర్ఎఫ్సీఎల్.. తదితర పరిశ్రమల్లో జీవో ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం దృష్టికి తీసుకెళ్లానని, ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
రామగుండంలోని జెన్కో విద్యుత్ప్లాంట్ను విస్తరిస్తూ సింగరేణి ఆధ్వర్యంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ఏర్పాటుకు సీఎంతో మాట్లాడుతున్నానన్నారు. మేడిపల్లి, లింగాపూర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపచేసేలా చూస్తానని తెలిపారు. రామగుండంతో పాటు పెద్దపల్లి, బెల్లంపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎంను కోరామన్నారు. అసెంబ్లీలో వివిధ సమస్యలపై 12 సార్లు మాట్లాడానని, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన సమయాన్ని వృథా చేశారని గుర్తు చేశారు.