యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి

గోదావరిఖని, వెలుగు: ప్రజా ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ తెలిపారు. వివిధ వృత్తుల నైపుణ్య శిక్షణకు రిజిస్ట్రేషన్​ చేసుకున్న వారిని సోమవారం హైదరాబాద్​కు తీసుకెళ్తుండగా వారి వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆర్జీ 1 ఏరియా టెక్నికల్​ ట్రైనింగ్​ సెంటర్​లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జీఎంఆర్​ వరలక్ష్మి ఫౌండేషన్​ ఆధ్వర్యంలో 150 మంది యువకులకు నైపుణ్య శిక్షణ అందించడానికి చర్యలు తీసుకున్నామన్నారు.

 ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు ఆధ్వర్యంలో రామగుండంలో ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీపై శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్​ కోయ శ్రీహర్ష, ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్​ కుమార్​, ఏసీపీ ఎం.రమేశ్‌‌‌‌, ఏఐటీయూసీ సెక్రెటరీ కె.స్వామి, సీఎంవోఏఐ  ప్రెసిడెంట్​ మల్లేశం, సేవా ప్రెసిడెంట్​అనిత, కార్పొరేటర్​ తేజస్విని, ప్రకాశ్​, కిరణ్​బాబు, కర్ణ నాయక్​, పాల్గొన్నారు.