రూ.100 కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లు : ఎంఎస్ రాజ్ ఠాకూర్

గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్​ అభివృద్ధికి రూ.100 కోట్ల టెండర్లు పిలిచామని, మరో రూ.20 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తెలిపారు. సోమవారం ఆయన డివిజన్​ బాట కార్యక్రమంలో భాగంగా మేయర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్​ సీహెచ్​ శ్రీకాంత్​, వివిధ విభాగాల ఆఫీసర్లతో కలసి పలు ప్రాంతాల్లో పర్యటించారు.

సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్​ఎఫ్​సీఎల్​ తదితర పరిశ్రమలను ఇన్వాల్​ చేసి మున్సిపల్​ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనంతరం సంజయ్ గాంధీ నగర్ ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జంగపల్లి సరోజన, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్​, ఎండీ ముస్తఫా, ఇఇ రామన్ పాల్గొన్నారు.