రామగుండం పవర్​ ప్లాంట్​నిర్మాణాన్ని చేపట్టాలి :ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​

  •  సీఎంను కోరిన ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: రామగుండంలో మూసివేసిన 62.5 మెగావాట్ల పవర్​ ప్లాంట్​ స్థానంలో కొత్తగా 800 మెగావాట్ల సూపర్​ క్రిటికల్​ పవర్​ ప్లాంట్​ ఏర్పాటుకు గ్రీన్​ సిగ్నల్​ వచ్చినందున దాని నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ సీఎం రేవంత్​రెడ్డిని కోరారు. 

శుక్రవారం హైదరాబాద్​లో ఆయన సీఎంను కలిసి పవర్​ ప్లాంట్​ ఏర్పాటుకు సహకరించినందుకు పుష్ఫగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్​ ఆఫ్ మెడికల్ కాలేజీలో అదనపు విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు.