సిద్ధాపూర్ రిజర్వాయర్ ను త్వరగా పూర్తిచేయాలి : ఎమ్మెల్యే పోచారం 

బాన్సువాడ, వెలుగు : సిద్ధాపూర్ రిజర్వాయర్​ను త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయసలహాదారుడు, ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోచారం అధికారులకు సూచించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పై గురువారం హైదరాబాద్​లోని తన నివాసంలో అధికారులతో పోచారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 70,670 కుటుంబాలు ఉంటే..

అందులో 66,670 మంది రైతులు ఉన్నారని తెలిపారు. అంటే 90 శాతం రైతు కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం లక్షా యాబై వేల ఎకరాల సాగు భూమి ఉన్నదని వివరించారు. ఇందులో లక్ష ఎకరాలు నిజాంసాగర్ ఆయకట్టులో ఉన్నాయని తెలిపారు.

 సిద్ధాపూర్ రిజర్వాయర్ 

నా ఆశయమని, ఈ ప్రాంతంలోని 14,000 ఎకరాల మెట్ట భూములకు పుష్కలంగా నీళ్లు అందాలన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ రూ.200 కోట్లతో ఒక టీఏంసీ కెపాసిటీ తో నిర్మిస్తున్నామని తెలిపారు. రిజర్వాయర్ కట్టతోపాటు పొలాలకు నీళ్లందించే కుడి, ఎడమ కాల్వల పని కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.