పీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్యేలు

యాదాద్రి, వెలుగు : టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్​కుమార్​గౌడ్​ను యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేలు వేర్వేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం గాంధీభవన్​లో మహేశ్​కుమార్​ గౌడ్​ను ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి కలిసి బొకేలు అందజేశారు. వారి వెంట డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.