చొప్పదండి’ని వాటర్​ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుస్తాం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, వెలుగు: చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించి, వాటర్​హబ్​గా మారుస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం చొప్పదండి మండలం గుమ్లాపూర్​లోని వేంకటేశ్వరస్వామి గుట్ట వద్ద మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు రూ.300 కోట్లతో నిర్మించనున్న నాలుగు ఓటీల నిర్మాణ పనులను భూనిర్వాసితులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎస్సారెస్పీ కాలువ, వరద కాలువ, గాయత్రీ పంప్​హౌజ్ ఉన్నప్పటికీ చొప్పదండి, రామడుగు మండలాల్లోని చాలా గ్రామాలకు నీరందలేదని, దీనిపై గతంలో తాను కొట్లాడితే కేసులు పెట్టారన్నారు. కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్​రెడ్డి, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ గుర్రం నీరజ, ఏఎంసీ చైర్మన్ మహేశ్, వైస్ చైర్మన్ రాజేందర్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్​రెడ్డి, పట్టణ అధ్యక్షుడు తిరుపతి, కౌన్సిలర్ అశోక్, లీడర్లు పాల్గొన్నారు.

మల్యాల, వెలుగు: మల్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సత్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డ పెళ్లికి సాయంగా అందజేసే నగదుతో పాటు తులం బంగారం హామీని త్వరలో నెరవేరుస్తామన్నారు. కాగా గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్సిడీ డబ్బులు రావడం లేదని అక్కడున్న మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇష్యూతో సబ్సిడీ రావడం లేదని, మరో రెండు నెలల్లో ప్రతిఒక్కరికీ డబ్బులు వస్తాయన్నారు.