స్టూడెంట్స్​ ​సెల్ ఫోన్ మోజులో పడొద్దు : ఎమ్మెల్యే మట్టా రాగమయి

పెనుబల్లి, వెలుగు  : విద్యార్థులు చదువులు పక్కన పెట్టి సెల్ ఫోన్ మోజులో పడొద్దని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు.  మండల పరిధిలోని కుప్పెనకుంట్ల గ్రామంలోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గాల్లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్​ చేస్తోందన్నారు. టెన్త్​ స్టూడెంట్స్​మంచిగా చదివి వంద శాతం రిజల్ట్స్ సాధించాలని సూచించారు. 

అనంతరం విద్యార్థులతో కలిసి పతంగులు ఎగురవేశారు. చిన్నారులకు బోగి పళ్లు పోశారు. సీఎంఆర్ఎఫ్​లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ, తహసీల్దార్ గంటా ప్రతాప్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ దేవమణి పాల్గొన్నారు