దళిత వాడలపై ప్రత్యేక శ్రద్ధ : మామిడాల యశస్వినిరెడ్డి

పాలకుర్తి, వెలుగు : నియోజకవర్గంలోని దళితవాడలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి ఎస్సీ కాలనీలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. సైడ్ డ్రైనేజీలు పరిశీలించి, శానిటేషన్ పై చొరవ తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. అర్హులైన నిరుపేదలందరికీ సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు.

ఆమెవెంట కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​చార్జి అనుమాండ్ల ఝాన్సీరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్య నారాయణ, మండలాధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్ తదితరులున్నారు. అనంతరం గ్రామంలోని ఆలయంలో జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆలయంలో పెండింగ్​ పనులు, అభివృద్ధికి కావాల్సిన నిధుల అంచనాలను తెలసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.