రైతులకు అందుబాటులో ఉంటూ సేవలందించాలి  :  ఎమ్మెల్యే మదన్మోహన్ రావు 

సదాశివనగర్, వెలుగు: కొత్త వ్యవసాయ మార్కెట్​ కమిటీ పాలక వర్గం రైతులకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్​రావు, ఎంపీ సురేశ్​షెట్కార్ అన్నారు. శుక్రవారం  సదాశివనగర్​ మార్కెట్​ కమిటీ ఏఎంసీ కార్యదర్శి గంగు ఆధ్వర్యంలో  నూతన పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఏఎంసీ పాలక వర్గం రైతులకు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు.

రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు, రైతులకు ఎప్పటికప్పుడు వివరించాలన్నారు.   కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్​ సంగ్యా నాయక్​, వైస్​ చైర్మన్​ రాజిరెడ్డి, జిల్లా సేవాదళ్​అధ్యక్షుడు లింగాగౌడ్​, జిల్లా ఎస్సీసెల్​ అధ్యక్షుడు బాగయ్య మండల పార్టీ అధ్యక్షుడు సంగారెడ్డి ఎల్లారెడ్డి నియోజక వర్గ యూత్​ అధ్యక్షుడు సంపత్​ గౌడ్​, మాజీ జడ్పీటీసీ నారెడ్డి మోహన్​ రెడ్డి, గీరెడ్డి మహేందర్​ రెడ్డి, యూత్​ అధ్యక్షుడు అన్వేశ్​గౌడ్, ఇర్షాద్, లడ్డు శ్రీనివాస్​ రెడ్డి, ఆకుల శ్రీనివాస్, సూపర్​ వైజర్​ నామాల  లక్ష్మీనారాయణ, విండో చైర్మన్​ గంగాధర్​  తదితరులు పాల్గొన్నారు.