సేవాలాల్ను స్ఫూర్తిగా తీసుకోవాలి : కుందూరు జయవీర్ రెడ్డి

హాలియా, వెలుగు: గిరిజన సామాజిక వికాసా నికి కృషి చేసిన సంత్ సేవాలాల్ను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి సూచించారు. ఆదివారం నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని సేవాలాల్ మహరాజ్ ప్రాగణంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యం లో నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం

గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తోందని చెప్పారు. నియోజవర్గ అధ్యక్షుడుధనావత్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బంజారా సీనియర్ నేత శంకర్ నాయక్, ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్ నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్య క్షులు శంకర్ నాయక్, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు బాణావత్ బాబురావు నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు భగవానా నాయక్, రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ నాయక్. జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు రవినాయక్ పాల్గొన్నారు.