యాదాద్రి, వెలుగు : భువనగిరి పోర్ట్‌కు రోప్ వేను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి తెలిపారు. గుట్ట చుట్టూ హైవేను కలుపుతూ ఫోర్వే రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రోప్ వే ఏర్పాటు చేసే పాయింట్‌ను ఆయన బుధవారం పరిశీలించి మాట్లాడారు. రోప్ వే, సౌండ్ అండ్ లైట్ఏర్పాటుతో టూరిజం సెంటర్‌గా భువనగిరి మారుతుందని తెలిపారు.
ఇందుకోసం రూ.55 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. జిల్లాలో యాదగిరి గుట్ట దేవస్థానం, బస్వాపురం రిజర్వాయర్సహా ఇతర కట్టడాల కారణంగా టూరిజం డెవలప్ అవుతుందన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ముత్తిరెడ్డిగూడెం వద్ద స్పోర్ట్స్టేడియం ఏర్పాటు కోసం రూ.33 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. వలిగొండ, బీబీనగర్, భూదాన్ పోచంపల్లిలోనూ స్పోర్ట్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట కలెక్టర్ హనుమంతు జెండగే, టూరిజం జీఎం ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, కమిషనర్రామాంజులరెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.